శివసేనలో చేరిన సినీ నటి ఊర్మిళ..

ముంబయి: సినీ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళ మతోండ్కర్ శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. శివసేనలో చేరనున్నట్లు గత కొన్ని రోజుల నుంచి ఊర్మిళపై ప్రచారం సాగుతున్నది. అయితే ఆ ఊహాగానాలకు ఆమె తెరదించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఊర్మిళ పోటీ చేసి ఓడిపోయారు. ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి నుంచి పోటీ చేసిన ఆమె ఆ ఎన్నికల్లో ఓడారు. పార్టీలో ఉన్న అంతర్గత కలహాల వల్లే తాను ఓడినట్లు ఆమె ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ గత ఏడాదే ఆమె రాజీనామా చేశారు. బాంద్రాలోని సీఎం థాకరేకు చెందిన మాతోశ్రీ నివాసంలో ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఊర్మిళ శివసేన పార్టీలో చేరారు. గవర్నర్ కోటాలో ఊర్మిళకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి.
जय महाराष्ट्र 🙏🏼🙏🏼🚩🚩🚩 pic.twitter.com/sUinOcagrP
— Urmila Matondkar (@UrmilaMatondkar) December 1, 2020