ఇస్రోలో 83 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

ISRO: భారత అంతరిక్ష సంస్థలో 83 పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, ఆటోమెబైల్ , సివిల్, రిఫ్రిజిరేషన్ &ఎసి, ఫిజిక్స్, కెమిస్ట్రి విభాగాలల్లో మొత్తం 83 భర్తీ చేయనున్నారు. దరఖాస్తులను ఈ నెల 4వ తేదీ నుండి 18వ తేదీ వరకు స్వీకరిస్తారు.
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు – 76
సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు – 5
లైబ్రరీ అసిస్టెంట్ -ఎ -2
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు వేతనం రూ. 44,900 నుండి రూ.1,42,400 వరకు ఉంటుంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రానిక్స్, ఇనుస్ట్రుమెంటేషన్), డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలవారు దరఖాస్తు చేసుకోవచ్చు.