దేశంలో కొత్త‌గా 8439 కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): భార‌త్‌లో కొంత కాలంగా క‌రోనా కేసు్లో హెచ్చు త‌గ్గులు కొన‌సాగుతున్నాయి. దేశంలో క‌రోనా వ్యాప్తి క‌ట్ట‌డిలోనే ఉండ‌గా.. ప్ర‌స్తుతం ఒమిక్రాన్ క‌ల‌వ‌రం మొద‌లైంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 23 మందిలో క‌రోనా ఒమిక్రాన్ ర‌కాన్ని గుర్తించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ బుధ‌వారం వెల్ల‌డించింది.

గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 12,13,130 మందికి కొవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 8,439 మందికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.

కొత్త‌గా గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 9,525 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.
దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు తాజా కేసుల‌తో క‌లిపి 3.46 కోట్ల మందికి క‌రోనా సోకింది.
ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 3.40 కోట్ల మంది క‌రోనాను జ‌యించారు.

గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 195 మంది క‌రోనా తో మ‌ర‌ణించారు.
దేశంలో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4.73 ల‌క్ష‌ల‌కు చేరింది.

Leave A Reply

Your email address will not be published.