ఎస్‌బిఐలో ఉద్యోగాలు 85% ఇంజినీరింగ్ విద్యార్థుల‌కే..

SBI:  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు శుభ‌వార్త తెలిపింది. త్వ‌ర‌లో 12 వేల నియామ‌కాలు చోప‌ట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీనిలో 85శాతం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల‌కే అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు బ్యాంక్ ఛైర్మ‌న్ దినేశ్ ఖారా వెల్ల‌డించారు. 3 వేల మంది పిఒలు, 8 వేల మంది అసోసియేట్ల‌కు బ్యాంకింగ్ వ్య‌వ‌హారాల్లో శిక్ష‌ణ ఇచ్చి.. వివిధ వ్యాపార విభాగాల్లో నియ‌మించ‌నున్న‌ట్లు స‌మాచారం. సాంకేతిక‌త ఆధారంగా క‌స్ట‌మ‌ర్ల‌కు కొత్త‌గా ఏ విధంగాఈ సేవ‌లందించాల‌నే దానిపై దృష్టి సారించాల్సిన పరిస్థితి నెల‌కొంద‌ని ఖారా అన్నారు. శిక్ష‌ణ పొందిన వారిని, ప్ర‌తిభ‌ను బ‌ట్టి వివిధ వ్యాపార‌, ఐటి బాధ్య‌త‌లు అప్ప‌గిచ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.