ఎన్నిక‌ల త‌నిఖీల్లో రూ. 8 వేల కోట్ల‌కు పైగా సొత్తు స్వాధీనం.. ఇసి

ఢిల్లీ (CLiC2NEWS): ఎన్నిక‌ల నేప‌థ్యంలో చేప‌ట్టిన త‌నిఖీల్లో ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 8 వేల కోట్లకు పైగా సొత్తు స్వాధీనం చేసుకున్న‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల క్ర‌మంలో చేప‌ట్టిన‌ త‌నిఖీల‌లో ఇప్ప‌టివ‌ర‌కు రూ. 8,889 కోట్ల మేర విలువైన న‌గ‌దు, మాద‌క ద్ర‌వ్యాలు, ఇత‌ర తాయిలాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు ఇసి ప్ర‌క‌టించింది. వీటిలో 45శాతం వాటా మాద‌క ద్ర‌వ్యాల‌దేన‌ని, రూ. 3,958 కోట్ల డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్న‌ట్లు వెల్లడించారు. న‌గ‌దు రూపేణా రూ. 849.15 కోట్లు, మ‌ద్యం రూ. 814 కోట్లు , బంగారం , వెండి ఆభ‌ర‌ణాలు రూ. 1,260.33 కోట్లు, ఇత‌ర ఉచితాలు రూ. 2006.59 కోట్లు ఉన్న‌ట్లు ఇసి తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.