పాక్లో పేలుడు.. 9 మంది చైనా ఇంజినీర్లు మృతి
మొత్తం 13 మంది మృతి.. పెరగనున్న మరణాలు
ఇస్లామాబాద్ (CLiC2NEWS): వాయువ్య పాకిస్తాన్లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. చైనా ఇంజినీర్లు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటన అప్పర్ కోహిస్తాన్లో చోటు చేసుకుంది. దాసు డ్యామ్ నిర్మాణ పనులకు ఓ బస్సులో 30 మంది చైనా ఇంజినీర్లు, వర్కర్లు వెళ్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది చైనా ఇంజినీర్లు, ఇద్దరు పారామిలటరీ సిబ్బంది, మరో ఇద్దరు వర్కర్లు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 13 మంది చనిపోయారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. చైనా ఇంజినీర్లను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చైనా ప్రభుత్వం డిమాండ్ చేసింది.