ఆటోను ఢీకొన్న ట్రక్కు.. 9 మంది మృతి!
కరీమ్గంజ్ (CLiC2NEWS): అసోంలో ని కరీమ్గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు ఆటోను ఢీకొన్న ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. బైతకాల్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ట్రక్కు మరియు ఆటో-రిక్షా ఎదురెదురుగా వస్తూ బలంగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని కరీంనగర్ జిల్లా పోలీసు అధికారి తెలిపారు.
“ఈప్రమాదం బైతఖల్ ప్రాంతంలోని 8వ జాతీయ రహదారిపై జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందినట్లు మాకు సమాచారం అందింది. “ అని పోలీసు అధికారి తెలిపారు.
ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలు ఉన్నారు. ప్రమాదం సమయంలో ఆటో రిక్షాలో మొత్తం 10 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇవాళ ఉదయం ఛత్ పూజ ముగించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసు అధికారి తెలిపారు.