సుప్రీంకోర్టు జ‌డ్జిలుగా 9 మంది ఒకేసారి ప్ర‌మాణం

న్యూఢిల్లీ (CLiC2NEWS): సుప్రీంకోర్టు లో కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయ‌మూర్తుల ప్ర‌మాణ స్వీకారాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డం న్యాయస్థానం చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగే సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల ప్ర‌మాణ స్వీకారం మత్ర‌మే ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం అయ్యేది. అంతే కాకుండా ఒకే సారి 9 మంది న్యాయ‌మూర్తులు ప్ర‌మాణం చేయ‌డం కూడా ఇదే మొద‌టి సారి.

ఇవాళ (మంగ‌ళ‌వారం) ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కొత్త జడ్జీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా నేపథ్యంలో ప్రమాణస్వీకార వేదికను మార్పు చేశారు. ఒకటో కోర్టు ప్రాంగణం నుంచి అదనపు భవనం ఆడిటోరియంలోకి వేదికను మార్చారు.

సుప్రీం కోర్టు జడ్జిలుగా ప్ర‌మాణం చేసిన వారిలో జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బీవీ నాగరత్నం, జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ రవికుమార్‌, జస్టిస్ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ సుందరేష్, జస్టిస్‌ ఏఎస్‌ ఒకా, జస్టిస్‌ విక్రమ్‌నాథ్ ఉన్నారు. ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది.

Leave A Reply

Your email address will not be published.