టెట్‌కు 90 రోజులు, డిఎస్‌సికి 90 రోజుల గ‌డువు.. రాష్ట్ర ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎపిలో టెట్‌, డిఎస్‌సి నిర్వ‌హ‌ణ‌కు కొత్త తేదీల‌ను ప్ర‌భుత్వం త్వర‌లో ప్ర‌క‌టించ‌నుంది. టెట్ నోటిఫికేష‌న్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. మెగా డిఎస్‌సి , టెట్ ప‌రీక్ష‌ల‌కు స‌మ‌యం కావాల‌ని వ‌స్తున్న అభ్య‌ర్థ‌న‌ల మేర‌కు ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల‌కు 90 రోజుల గ‌డువు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. టెట్ ప‌రీక్ష‌కు 90 రోజులు, డిఎస్‌సి ప‌రీక్ష‌ల‌కు 90 రోజుల స‌మ‌యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ మొత్తం ప్ర‌క్రియ 6 నెల‌లో పూర్తి చేసి 2025 జ‌న‌వ‌రిలో ఉద్యోగాలు భ‌ర్తీ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు కార్యాచ‌ర‌ణ పూర్తి చేయాల‌ని మంత్రి నారా లోకేశ్ ఆధికారుల‌ను ఆదేశించారు. త్వర‌లో టెట్‌, డిఎస్‌సి నిర్వ‌హ‌ణ‌కు కొత్త తేదీల‌ను ప్ర‌క‌టించ‌నుంది. కొత్త‌గా బిఇడి, డిఎడ్ పూర్తి చేసుకున్న వారికీ మెగా డిఎస్‌సిలో అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.