సింగరేణి నియామకాల్లో స్థానికులకే 95% ఉద్యోగాలు: సిఎండి శ్రీధర్
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో సింగరేణి భవన్‌లో సిఎండి శ్రీధర్ అధ్యక్షతన 561వ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం జరిగింది. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు సిఎండి వివరించారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలు, సింగరేణి వ్యాపార విస్తారణలో భాగంగా సుమారు రూ. 6,790 కోట్ల అంచనా వ్యయంతో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించి సమగ్ర రిపోర్టు రూపొందించామిన సిఎండి శ్రీధర్ తెలిపారు.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానికులకే ఎక్కువ శాతం అవకాశం కల్పించాలన్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు సింగరేణి సంస్థలో ఇకపై జరగనున్న జరగనున్న ఉద్యోగ నియామకాలలో స్థానిక రిజర్వేషన్ శాతాన్ని పెంచడానికి బోర్డు అంగీకారం తెలిపింది. ఇప్పటివరకు సింగరేణి విస్తరించిన నాలుగు ఉమ్మడి జిల్లాల వారికి అధికారేతర ఉద్యోగాల్లో 80% స్థానిక రిజర్వేషన్‌ను, అధికారుల ఉద్యోగాల్లో 60% స్థానిక రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నామని, రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఇకపై ఈ రెండు విభాగాల్లో స్థానిక రిజర్వేషన్‌ను 95% పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి బోర్డు అనుమతి లభించింది. త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని, దీని వలన సింగరేణి విస్తరించిన 4 ఉమ్మడి జిల్లాల స్థానిక అభ్యర్ధులు ఇకపై ప్రకటించే ఎగ్జిక్యూటివ్, ఎన్‌సిడబ్ల్యూఎ ఉద్యోగాల్లో 95% పోస్టులకు రిజర్వేషన్ పొందగలుగుతారు. మిగిలిన 5% ఓపెన్ కేటగిరీలో రిక్రూట్ చేస్తారు.