ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో 97 పోస్టులు

IOC: ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఐఒసి)లో 97 అసిస్టెంట్ క్వాలిటి కంట్రోల్ ఆఫీస‌ర్ పోస్టులు భ‌ర్తీ చేయనున్నారు.

ఆర్గానిక్‌/ ఇన్ ఆర్గానిక్‌/ అన‌లిటిక‌ల్/ ఫిజిక‌ల్ /అప్డైడ్ కెమిస్ట్రి/ ఇండ‌స్ట్రియ‌ల్ కెమిస్ట్రీతో ఎమ్ఎస్‌సి 60 మార్కుల‌తో ఉత్తీర్ణులైన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. పెట్రోలియం/ పెట్రో- కెమిక‌ల్ / పాలిమ‌ర్ / ఫెర్టిలైజ‌ర్ యూనిట్ల‌లో రెండేళ్ల ప‌ని అనుభ‌వం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 30 సంవ‌త్స‌రాల‌కు మించ‌కూడ‌దు. ఎస్‌సి ఎస్‌టిల‌కు ఐదేళ్లు, ఒబిసిల‌కు మూడేళ్లు , దివ్యాంగుల‌కు ప‌ది నుండి ప‌దిహేనేళ్లు , మాజి సైనికోద్యుగుల‌కు ఐదేళ్ల స‌డ‌లింపు ఉంటుంది.

కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి ) ద్వారా ఉద్యోగాల‌కు ఎంపిక చేస్తారు. ఇంట‌ర్వ్యూ , వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి కేట‌గిరీల వారిగా తుది ఎంపిక జ‌రుగుతుంది.

ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు వేత‌నం రూ.40,000 నుండి రూ.1,40,000 వ‌ర‌కు ఉంటుంది. మూల వేత‌నంతో పాటు ఇత‌ర‌ల అల‌వెన్సులు/ హెచ్ ఆర్ె, మెడిక‌ల్, గ్రాట్యుటి, పిఎఫ్‌, ఇన్స్యూరెన్స్‌, లీవ్ ఎన్ క్యాష్‌మెంట్, ఎల్‌టిఎ, క‌న్వేయెన్స్ అడ్వాన్స్‌.. వంటి స‌దుపాయాలు ఉంటాయి.

మొత్తం 97 పోస్టుల‌లో ఎస్‌సిల‌కు 13, ఎస్‌టిల‌కు 6, ఒబిసిల‌కు 24, ఇడ‌బ్ల్యుల‌కు 9, అన్ రిజ‌ర్వుడ్‌కు 45 పోస్టులు కేటాయించారు. ద‌ర‌ఖాస్తుల‌ను మార్చి 21వ తేదీలోపు పంపించాల్సి ఉంది. ద‌ర‌ఖాస్తు రుసుం జ‌న‌ర‌ల్‌, ఇడ‌బ్ల్యుఎస్‌, ఒబిసిల‌కు రూ.600గా నిర్ణ‌యించారు. ఇత‌రుల‌కు ఫీజు లేదు.

సిబిటి ని ఢిల్లీ/ ఎన్‌సిఆర్‌, ముంబ‌యి/ న‌వీ ముంయి, కోల్‌క‌తా, చెన్నైలో నిర్వ‌హిస్తారు. పూర్తి వివ‌రాల‌కు అభ్య‌ర్థులు http://www.iocl.com/ వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

 

Leave A Reply

Your email address will not be published.