బ్రిటన్‌ విమానాలపై నిషేధం పొడిగింపు

న్యూఢిల్లీ : బ్రిటన్‌ నుండి విమాన రాకపోకలపై విధించిన నిషేధాన్ని భారత ప్రభుత్వం జనవరి 7 వరకు పొడిగించింది. వచ్చే ఏడాది జనవరి 7 వరకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌పూరీ బుధవారం వెల్లడించారు. సేవల పునరుద్ధరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి ట్వీట్‌ చేశారు. బ్రిటన్‌లో కరోనా స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మొదట ఈ నెల 31 వరకు విమానాల రాకపోకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.