1 నుంచి తెలంగాణలో ఆన్లైన్ క్లాసులు షురూ

హైదరాబాద్: కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. ఇప్పట్లో బడులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసెస్ నిర్వహించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ర్ట వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రత్యేక (education) ప్రధాన కార్యదర్శి చిత్ర రామ్‌చంద్రన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈనెల 27 నుంచి ఉపాధ్యాయులు కూడా క్రమంగా పాఠశాలలకు హాజరవుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాల విద్యార్థులకు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిజిటల్ క్లాసులు ప్రారంభించనుంది. డిజిటల్ క్లాసులకు ఉపాధ్యాయులు ప్లాన్ సిద్ధం చేయనున్నారు. టీ-శాట్, దూరదర్శన్ వంటి డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా క్లాసులు బోధించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఆగస్ట్ 31 తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. తదుపరి ప్రభుత్వ నిర్ణయం వరకు అన్ని పాఠశాలలు విద్యార్థుల కోసం మూసివేయబడే ఉంటాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు.