ఆసీస్ జట్టులోకి వార్నర్ ఎంట్రీ..

మెల్‌బోర్న్‌: టీమిండియా ఆసీస్ పర్యటనలో భాగంగా 4 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో తలపడుతున్నాయి. అయితే ఇందులో ఇప్పటికే జరిగిన రెండు టెస్టులలో భారత్, ఆసీస్ ఒక్కో మ్యాచ్ లో విజయం సాధించాయి. అయితే ఈ పర్యటనలో జరిగిన మొదటి వన్డే సిరీస్ లో ఆసీస్ స్టార్ ఓపెనర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం బారిన విషయం తెలిసిందే. ఈ కారణంగా తర్వాత జరిగిన టీ20 సిరీస్ అలాగే ఇప్పటివరకు జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలోను వార్నర్ ఆడలేదు. కానీ భారత్‌తో జరగనున్న మూడో, నాల్గవ టెస్టులకు ఓపెనర్ డేవిడ్ వార్నర్ తిరిగి వస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం ప్రకటించింది. ఇక వార్నర్ స్థానంలో టెస్టు జట్టులోకి వచ్చి నిరాశ పరిచిన జో బర్న్స్ తన స్థానాన్ని కోల్పోయాడు. ఇక ప్రాక్టీస్ మ్యాచ్ ‌ల్లో గాయంతో తప్పుకున్న ఫాస్ట్ బౌలర్ సీన్ అబోట్ కూడా తిరిగి టెస్ట్ జట్టులో చేరనున్నాడు. అయితే వార్నర్ రాకతో ఆసీస్ జట్టులో బలం, ఉత్సహం రెండు పెరిగాయి.

Leave A Reply

Your email address will not be published.