కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌‌

న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి మ‌రో ముంద‌డుగు ప‌డింది. దేశీయంగ భార‌త్ బయోటెక్‌ రూపొందించిన ‘కొవాగ్జిన్‌’ వ్యాక్సిన్‌కు సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. అత్యవసర వినియోగానికి కంపెనీ పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించిన కమిటీ.. శ‌నివారం మ‌రోసారి స‌మావేశ‌మైన నిపుణుల క‌మిటీ అనుమతి తెలుపుతూ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు సిఫారసు చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో కొవాగ్జిన్‌ను భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు కూడా నిపుణుల కమిటీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. డీసీజీఐ అనుమతి తర్వాత రెండు వ్యాక్సిన్లు దేశంలో అత్యవసర వినియోగానికి అందుబాటులోకి రానున్నాయి.

అత్య‌వ‌స‌ర వినియోగ అనుమ‌తి అంటే..?

రోగికి ప్ర‌త్యామ్నాయ వైద్యం అందుబాటులో నేన‌ప్పుడు మాత్ర‌మే కొన్ని టీకాల‌ను అత్య‌వ‌స‌ర వినియోగం కోసం అనుమ‌తి ఇస్తారు. ఆ వ్యాక్సిన్ ఇచ్చే ముందు ప్ర‌తి రోగి నుంచి ముంద‌స్తు అనుమ‌తి ప‌త్రం తీసుకోవాలి. ఆ వ్యాక్సిన్ వ‌ల్ల త‌లెత్తే అవ‌కాశ‌మున్న దుష్ప్ర‌భావాల గురించి రోగికి, వారి కుటుంబ స‌భ్యుల‌కు ముందే చెప్పాలి.

Leave A Reply

Your email address will not be published.