ఐసోలేష‌న్‌లో ఐదుగురు భార‌త క్రికెట‌ర్లు‌

మెల్‌బోర్న్‌: టీమ్ ఇండియాకు చెందిన ఐదుగురు క్రికెట‌ర్ల‌ను ఐసోలేష‌న్‌కు పంపించారు. మెల్‌బోర్న్‌లోని ఓ హోట‌ల్‌లో క‌లిసి భోజ‌నం చేయ‌డంతో ఇత‌ర క్రికెట‌ర్ల‌తో వారిని దూరంగా ఉంచిన‌ట్లు తెలిసింది.  రోహిత్‌శ‌ర్మ‌తోపాటు శుభ‌మ‌న్ గిల్‌, పృథ్వి షా, న‌వ్‌దీప్‌సైనీ, రిష‌బ్ పంత్‌ల‌ను మిగ‌తా టీమ్‌తో విడిగా ఉంచాల‌ని బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణ‌యించాయి. ఈ ఐదుగురు ప్లేయ‌ర్స్ న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా బ‌య‌టి రెస్టారెంట్‌కు వెళ్లి భోజ‌నం చేశారు. ఈ ఐదుగురు ప్లేయ‌ర్స్ ఇక నుంచి మిగ‌తా టీమ్స్‌తో ప్ర‌యాణించ‌డంగానీ, ప్రాక్టీస్ చేయ‌డం కానీ కుద‌ర‌దు. వీళ్లు రెస్టారెంట్‌లో భోజ‌నం చేస్తున్న వీడియోతోపాటు వాళ్ల బిల్లు కూడా తానే చెల్లించాన‌ని ఓ అభిమాని ట్వీట్ చేయ‌డంతో ఇటు బీసీసీఐ, అటు క్రికెట్ ఆస్ట్రేలియా అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి.

ప్ర‌స్తుతం ఇండియా, ఆస్ట్రేలియా టీమ్స్ మెల్‌బోర్న్‌లోనే ఉన్నాయి. జ‌న‌వ‌రి 7న సిడ్నీలో జ‌ర‌గబోయే మూడో టెస్ట్ కోసం 4వ తేదీన అక్క‌డికి వెళ్ల‌నున్నాయి. ఈ సిరిస్‌లో 1-1తో సమం కావ‌డంతో సిడ్నిలో జ‌రిగే మూడో టెస్టుపై అంద‌రి దృష్టి నెల‌కొంది.

Leave A Reply

Your email address will not be published.