రాయగఢ్ జిల్లాలో కొనసాగుతున్న సహాయక చర్యలు

ముంబయి: మహారాష్ట్రలోని రాయ్‌గ‌ఢ్ జిల్లా మహద్ పట్టణంలో సోమవారం సాయంత్రం ఐదు అంతస్తుల భవనం కూలిన సంగతి తెలిసిందే. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘ‌ట‌నా స్థ‌లంలో భారీగా స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. శిథిలాల‌ను తొల‌గిస్తున్నారు. మూడు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు, 12 అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇప్పటివరకు శిథిలాల నుండి 60 మందిని కాపాడామని, మరో 30 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ (మంగ‌ళ‌వారం) ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాలు ఓ నాలుగేళ్ల బాలుడిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీశారు. దాదాపు 20 గంట‌ల నుంచి రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ది. ప‌దేళ్ల క్రితం మ‌హ‌ద్‌లో నిర్మించిన అయిదు అంత‌స్తుల భ‌వ‌నంలో మొత్తం 45 ఫ్లాట్లు ఉన్నాయి. ఇవాళ శిథిలాలు తొలిగిస్తున్న స‌మ‌యంలో.. నాలుగేళ్ల బాలుడిని కాపాడారు. ఇవాళ ఉద‌యం ఓ మృత‌దేహాన్ని వెలికి తీసిన‌ట్లు ఎన్‌డీఆర్ఎఫ్ ఆఫీస‌ర్ అలోక్ కుమార్‌ చెప్పారు. మ‌రో చిన్నారిని కూడా ర‌క్షించామ‌న్నారు. క‌లెక్ట‌ర్ ఇచ్చిన స‌మాచారం మేర‌కు మ‌రో 17 మంది శిథిలాల కింద ఉండి ఉంటార‌న్నారు. కాగా, పదేళక్రితం నాటి ఐదంతస్థుల భవనంలో 45కి పైగా ప్లాట్లు ఉన్నాయి. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ముంబయికి తరలిస్తున్నారు. మహారాష్ట్ర మంత్రులు అదితి తట్కరే, ఏక్‌నాథ్‌ షిండే సంఘటనా స్థలాన్ని సందర్శించారు. భవనం కాంట్రాక్టర్‌ యూనస్‌ షేక్‌, ఆర్కిటెక్చర్‌లపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, కాజల్‌పురా ప్రాంతంలో ఉన్న ఈ భవనంలో 40 నుంచి 45 కుటుంబాలు ఉంటున్నాయని, అయితే ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఎంత మంది ఉన్నారనే విషయంపై స్పష్టత లేదని అన్నారు. (చదవండి : రాయ్‌గఢ్ కూలిన భవనం)

 

 

 

1 Comment
  1. img says

    What’s up Dear, are you really visiting this site on a regular basis, if so afterward you will
    definitely get good experience.

Leave A Reply

Your email address will not be published.