కరోనా‌పై యద్ధంలో కీలక మలుపు: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: భారత దేశం కోవిడ్ రహితం కాబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రెండు వ్యాక్సిన్లకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి మంజూరు చేసిందని, ఆరోగ్యవంతమైన, కోవిడ్ రహిత భారత దేశానికి మార్గం సుగమమైందని తెలిపారు. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు టీకాలు అందుబాటులోకి రావడం శుభపరిణామం అని ప్రధాని మోడీ తెలిపారు. ఈ సందర్భంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకురావడంలో కృషి చేసిన శాస్త్రవేత్తలను ప్రధాని మోడీ అభినందిస్తూ ట్వీట్ చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ల వినియోగంపై డిసీజీఐ తీసుకున్న నిర్ణయం ఆరోగ్యవంతమైన, కోవిడ్ రహిత దేశంగా భారత్ ఆవిర్భవించేందుకు సహకరిస్తుందని అన్నారు. డిసీజీఐ అనుమతి పొందిన రెండు టీకాలు భారత్ లోనే తయారు కావడం గర్వకారణమని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ప్రధాని మెచ్చుకున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.