భారత్ బయోటెక్‌కు అభినందనలు: మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : టీకాల రాజధానిగా హైదరాబాద్ విరాజిల్లుతోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఆదివారం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను దేశంలో అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి అనుమతి ఇవ్వడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. టీకాల రాజధానిగా హైదరాబాద్ విరాజిల్లుతోందని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తల కృషి వల్లనే హైదరాబాద్‌కు ఈ ఖ్యాతి వచ్చిందన్నారుజ
“కోవాక్సినోకు DCGI అనుమతి పొందినందుకు డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా మరియు మొత్తం శాస్త్రవేత్తల బృందం -భారత్బయోటెక్ కు చాలా అభినందనలు.“ అని ట్వీట్ చేశారు
Many Congratulations to Dr. Krishna Ella, Suchitra Ella & the entire team of scientists @BharatBiotech on getting DCGI approval for Covaxin👍
Hyderabad continues to shines on as the vaccine capital because of the pursuit of excellence of scientists & innovative entrepreneurs
— KTR (@KTRTRS) January 3, 2021