ఎపిలో వేగంగా వ్యాపిస్తున్న వైర‌స్‌

అమరావతి : ఎపిలో క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,927 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. అదే సమయంలో 92 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,71,639 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. మొత్తం మరణాల సంఖ్య 3,460కి చేరుకుంది. ప్రస్తుతం 89,932 మంది కరోనా రోగులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 2,78,247 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 9,419 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇదే సమయంలో 64,351 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 33,56,852 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.
చిత్తూరు జిల్లాలో అత్య‌ధికంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే అనంత‌పురంలో 11, క‌డ‌ప‌లో 10, ప్ర‌కాశం 10 తూర్పుగోదావ‌రి 8, ప‌శ్చిమ‌గోదావ‌రి 8, గుంటూరు, నెల్లూరు, శ్రీ‌కాకుళం, విశాఖ జిల్లాల్లో ఆరుగురు చొప్పున‌, కృష్ణా జిల్లాలో న‌లుగురు, విజ‌య‌న‌గ‌రంలో ఒక‌రు చొప్పున మ‌ర‌ణించారు.

 

Leave A Reply

Your email address will not be published.