ఇండోనేషియా విమానం అదృశ్యం

జకార్తా: ప్రయాణికులను తీసుకుని ఎగిరిన నాలుగు నిమిషాలకే ఇండోనేషియాకు చెందిన విమానం అదృశ్యమైంది. జకార్తా నుంచి పాంటియానక్ వెళ్తున్న ఎస్జే 182 శ్రీవిజయ ఎయిర్ బోయింగ్ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాలకే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. దాంతో అధికారులు విమానం ఆచూకీ కోసం రాడార్ సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. అదృశ్యమైన విమానంలో ఐదుగురు చిన్నారులు సహా 59 మంది ప్రయాణికులు ఉన్నారని ఇండోనేషియా అధికారులు తెలిపారు. విమానం జకర్తా నుంచి బోర్నియో ఐలాండ్‌లోని పోన్‌టియానక్‌కు వెళ్తూ అదృశ్యమైందని ఇండోనేషియా ట్రాన్స్‌పోర్టు మినిస్ట్రీ వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.40 గంటలకు విమానంతో రాడార్‌కు సంబంధాలు తెగిపోయాయని తెలిపింది. అదృశ్యమైన సమయంలో విమానం 10 వేల అడుగుల ఎత్తులో ఉందని, టేకాఫ్ అయిన నాలుగు నిమిషాలకే సంబంధాలు తెగిపోయాయని పేర్కొన్నది.