వార‌ఫ‌లాలు (జ‌న‌వ‌రి 10-16)

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి)

ఈ వారం కుటుంబంలో మీ సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగి, అనుకోని హోదాలు దక్కుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ప్రగతిదాయకంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభ రాశి (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి)

ఈ వారం భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వారం చివరిలో సోదరులతో విభేదాలు. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిథున రాశి (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి)

ఈ వారం వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతమైన కాలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. భూవివాదాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. రుణాలు చేస్తారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటక రాశి (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి)

ఈ వారం వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. కళారంగం వారికి కొంత నిరాశ తప్పదు. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వేడుకలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఆరోగ్యభంగం. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులతో వివాదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి)

ఈ వారం ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత తగ్గే సూచనలు. కళారంగం వారి యత్నాలు సఫలమవుతాయి. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరుల నుంచి ధనలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. అనారోగ్య సూచనలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యా రాశి (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి)

ఈ వారం వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. మిత్రులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. వాహనసౌఖ్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటిలో కార్యాలు నిర్వహిస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనుకోని ఖర్చులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులా రాశి (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి)

ఈ వారం వ్యాపారాలలో నూతనోత్సాహం, అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చిక రాశి (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి)

ఈ వారం వ్యాపారాలు విస్తరిస్తారు, భాగస్వాములతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. కళారంగం వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి విషయాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూల ఫలితాలు. గృహ నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి)

ఈ వారం ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రశంసలు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. స్వల్ప అనారోగ్యం. పనుల్లో విజయం సాధిస్తారు. మిత్రులు, బంధువులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. చిరకాల కోరిక నెరవేరే సమయం. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి)

ఈ వారం వ్యాపారాలలో లాభాలు ఆశించినంతగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి మరిన్ని అవకాశాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థుల యత్నాలు కలసివస్తాయి. మీ ఊహలు నిజం చేసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి)

ఈ వారం ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. అనుకున్న పనుల్లో పురోగతి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ప్రముఖులతో పరిచయాలు. ప్రత్యర్థులు సైతం సహాయపడతారు. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. సోదరులతో వివాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీన రాశి (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి)

ఈ వారం వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కుటుంబంలో కార్యాలు నిర్వహిస్తారు. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. తీర్థ యాత్రలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

-ఎన్‌.రాజ్య‌ల‌క్షి
 జ్యోతిష్య‌పండితులు

 

Leave A Reply

Your email address will not be published.