ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ టైటిల్‌పై వీడ‌ని సస్పెన్స్!

రాజ‌మౌళి ఆర్. ఆర్‌. ఆర్‌. సినిమాతో జూనియ‌ర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తీయ‌నున్న సినిమా 2021లోనే పట్టాలెక్కనుంది. అరవింద సమేత సినిమా తర్వాత మరోసారి ఈ జోడి కలిసి పని చేయబోతున్నారు. దానికితోడు అల వైకుంఠపురంలో సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో త్రివిక్రమ్ తర్వాత సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.

కాగా ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమా టైటిల్ ముందు నుంచి కూడా `అయిననూ పోయిరావలె హస్తినకు` అంటున్నారు. ఇందులో రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. అ.. సెంటిమెంట్ కూడా ఉండటంతో ఇదే నిజమని అంతా ఫిక్సయ్యారు కూడా. కానీ ఇప్పుడు ఈ టైటిల్ మారబోతుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ కోసం తన అ.. సెంటిమెంట్ కూడా త్రివిక్రమ్ పక్కనబెట్టేస్తున్నాడు. ఈ సినిమాకు ముందు నుంచి అనుకున్న టైటిల్ కాకుండా చివరి నిమిషంలో మార్చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. దీనికి `చౌడప్ప నాయుడు` అనే టైటిల్ పరిశీలిస్తున్నాడు మాటల మాంత్రికుడు. కథ ప్రకారం ఈ టైటిల్ అయితేనే బాగుంటుందని చిత్రయూనిట్ కూడా భావించడంతో మాటల మాంత్రికుడు కన్విన్స్ అయినట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.