ధరణి వెబ్‌సైట్‌లో మరో కొత్త ఆప్షన్

హైదరాబాద్: వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెలంగాణ సర్కార్ తెచ్చిన ధరణి పోర్టల్ లో మరో కొత్త ఆప్షన్ వచ్చి చేరింది. పట్టాదార్ పాస్‌బుక్ (పీపీబీ) నకలు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు సిటిజన్ లాగిన్‌లో ప్రత్యేకంగా ‘క్రియేట్ పీపీబీ రిక్వెస్ట్’ అనే ఆప్షన్‌ను చేర్చారు. ఇందుకోసం పట్టాదార్ పాస్‌బుక్ నంబర్, ఆధార్‌లోని మొదటి నాలుగు నంబర్లు నమోదుచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్దేశిత ఫీజు చెల్లిస్తే.. పట్టాదార్ పాస్‌బుక్ నకలు యజమాని చిరునామాకు వస్తుందని అధికారులు తెలిపారు.