శంషాబాద్ టూ షికాగో నాన్ స్టాప్..

హైదరాబాద్ : అమెరికా ప్రయాణికులకు గుడ్‌న్యూస్. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి షికాగోకు నాన్‌స్టాప్ విమానాన్ని ఎయిరిండియా శుక్రవారం ప్రారంభించింది. ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి ఎయిరిండియా విమానం షికాగో బయల్దేరనుంది. షికాగో నుంచి ప్రతి బుధవారం హైదరాబాద్‌కు మరో విమానం బయల్దేరనుంది. అయితే హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లాలంటే కనీసం ఒకట్రెండు చోట్ల విమానాలు ఆగేవి. కానీ ఎయిరిండియా నాన్ స్టాప్ విమానం ప్రారంభించడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రయాణికులకు ప్రయాణ సమయం కొంత తగ్గనుంది.
కాగా శంషాబాద్ నుంచి నేరుగా చికాగోకు విమాన సర్వీసును ప్రారంభిస్తున్నందుకు రాజీవ్ గాంధీ విమానాశ్రయం అధికారులను, ఎయిర్ ఇండియాకు రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.
My compliments to @airindiain and @RGIAHyd on launching a non-stop direct flight from Hyderabad to Chicago starting today 👍
May this just be the beginning of many more direct intercontinental flights from Hyderabad
— KTR (@KTRTRS) January 14, 2021