ఇండోనేషియాను కుదిపేసిన భూకంపం-ఏడుగురు మృతి

జకార్తా: ఇండోనేషియాను భారీ భూకంపం కుదిపేసింది. శుక్రవారం తెల్లవారుజామున సులవేసి ద్వీపంలో రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రతతో భూమి కంపించింది.దీంతో పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు. వందల సంఖ్యలో ప్రజలు తీవ్ర గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్యపెరిగే అవకాశం ఉందని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ శుక్రవారం తెలిపింది. ఏడు సెకన్ల పాటు భూమికి కంపించడంతో జనం ఒక్కసారిగా భయాందోళనకు గురై ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మజేనే నగరంలో నలుగురు మరణించగా.. 637 మంది గాయపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట తర్వాత భూకంపం సంభవించడంతో వేలాది మంది ఇండ్ల నుంచి పరుగులు పెట్టారని, కనీసం 60 ఇళ్లకు నష్టం వాటిల్లిందని విపత్తు నిర్వహణ సంస్థ చెప్పింది.