వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. శనివారం ఉదయం 10:30 నిమిషాలకు వర్చువల్ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొని వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందన్న టెన్షన్ ఉండేదని, కరోనా టీకా వచ్చేసిందని మోదీ అన్నారు. రాత్రి, పగలు లేకుండా శాస్త్రవేత్తలు టీకా కోసం శ్రమించారన్నారు. చాలా తక్కువ సమయంలో టీకా వచ్చేసిందన్నారు. మేడి ఇన్ ఇండియా టీకాలు రెండు వచ్చాయన్నారు. ఇది భారత సామర్థ్యం అన్నారు. వైజ్ఞానికి సత్తా అన్నారు. భారతీయ ట్యాలెంట్ అన్నారు. ఎవరికైతే అత్యవసరమో.. వారికి ముందుగా టీకా ఇస్తున్నాం అన్నారు. రెండు డోసులు వ్యాక్సిన్ తప్పనిసరి అన్నారు. అన్ని రాష్ట్రాలు కూడా టీకా పంపిణీకి సన్నద్దం అయి ఉన్నాయన్నారు. తొలి దఫాలో మూడు కోట్ల మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా ఇస్తున్నట్లు మోదీ తెలిపారు. కోవాగ్జిన్, కోవీషీల్డ్తో పాటు మరికొన్ని టీకాల అభివృద్ధి జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత ముందు జాగ్రత్తలను అసలు మరవకూడదని మోదీ అన్నారు. మాస్క్లు ధరించడం, సోషల్ డిస్టాన్స్ పాటించడం తప్పనిసరి అన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలని ఆయన దేశ ప్రజలను కోరారు.
[…] […]