బాలుకు ప‌ద్మ‌విభూష‌ణ్‌

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర స‌ర్కార్‌

న్యూఢిల్లీ: 72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్కరించుకుని `ప‌ద్మ‌` అవార్డుల‌ను కేంద్ర స‌ర్కార్ ప్ర‌క‌టించింది. 2021 సంవ‌త్స‌రానికి గాను ఏడుగురికి పద్మ విభూషణ్‌, ప‌ది మందికి పద్మభూషణ్‌, 102 మందికి పద్మశ్రీ పురస్కారాల‌ను ప్ర‌క‌టించింది.

గాన గంంధ‌ర్వుడు దివంగ‌త ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని ప‌ద్మ‌విభూష‌ణ్‌తో గౌర‌వించింది. ప‌ద్మ‌విభూష‌ణ్‌కు ఎంపికైన వారిలో జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబే కూడా ఉన్నారు.

పద్మ విభూషణ్‌:

  1. షింజో అబే(జపాన్‌ మాజీ ప్రధాని)
  2. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(గాయకుడు)
  3. బెల్లె మోనప్ప హెగ్డే(వైద్యరంగం)
  4. నరీందర్‌ సింగ్‌(సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, అమెరికా‌)
  5. మౌలానా వహిదుద్దీన్‌ ఖాన్‌(ఆధ్యాత్మికత)
  6. బీబీ లాల్‌(ఆర్కియాలజీ)
  7. సుదర్మన్‌ సాహూ(ఆర్ట్‌)

తెలుగు రాష్ట్రాల‌కు నుంచి ఈ సారి న‌లుగురిని ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాలు వ‌రించాయి. వీరిలో ఎపి నుంచి మ‌గ్గురు, తెలంగాణ నుంచి ఒక్క‌రు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.