దేశంలో కొత్త‌గా 9,102 క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: క‌రోనా కేసులు భార‌త్‌లో క్ర‌మంగా త‌గ్గుతున్న‌ట్టు తెలుస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 9,102 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు ఇవాళ ఉద‌యం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. కాగా క‌రోనా నుంచి 15,901 మంది కోలుకోగా, 117 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 1,53,587కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 1,06,76.838 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 1,77,266 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మ‌హ‌మ్మారి నుంచి 1,03,45,985 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Leave A Reply

Your email address will not be published.