గిన్నీస్‌ రికార్డే: నీటి అడుగున ఆరు ర్యూబిక్‌ క్యూబ్స్‌ ..

చెన్నై : టాలెంట్ ఉండాలే కాని రికార్డులు వారి ముంగిట వాలుతాయి… వారికి రికార్డులు కొత్తేమి కాదు.. రూబిక్స్‌ క్యూబ్స్‌ను సాల్వ్ చేయ‌డ‌మంటే మాములు విష‌యం కాదు.. మామూలు వాళ్ల‌కి ఎన్ని గంట‌లు చేసినా అది సాధ్యం కాదు. అలాంటిది చెన్నై యువ‌కుడు ఆరు రూబిక్స్‌ క్యూబ్స్‌ను సాల్వ్ చేసి రికార్డు మోత మోగించాడు… మామూలు రికార్డు కాదు… గిన్నీస్ రికార్డు.. ఈ ఆరు క్యూబ్స్‌ను రెండు నిమిషాల 17 సెకన్లలో పరిష్కరించాడు.. ఇది వరల్డ్‌ రికార్డే మరి. చెన్నైకి చెందిన ఇల్లారాయమ్‌ శేఖర్‌ (25) ఈ రికార్డుతో గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించాడు. ఎక్వేరియం లాంటి ఒక పెద్ద నీటి తొట్టెలో కూర్చుని సింగిల్‌ బ్రీత్‌లో ఈ అరుదైన రికార్డును సాధించాడు. యోగా, మెడిటేషన్‌, శ్వాస నియంత్రణ పద్ధతులను ఉపయోగించి భారత్‌కు చెందిన ఇల్లారాయం శేఖర్‌ నీటి అడుగున ఆరు రూబిక్స్‌ క్యూబ్స్‌లను సాల్వ్‌ చేసి రికార్డు సాధించాడని గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొంది. అలాగే నీటి అడుగున ఎక్కువ సేపు గడిపేందుకు ప్రాణాయామాన్ని సాధన చేసినట్లు తెలిపింది. అతని వీడియోను కూడా జత చేసింది. ”ఈ రికార్డు నా కెరీర్‌ను మలుపు తిప్పిందని, మరింత ఆత్మస్థైర్యాన్నిచ్చిందని, మరిన్ని రికార్డులు సాధించేందుకు సిద్ధంగా ఉన్నాను” అని శేఖర్‌ తెలిపారు. ఏది ఏమైన శేఖ‌ర్ ది గ్రేట్‌..

 

Leave A Reply

Your email address will not be published.