ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్..

శ్రీ‌కాకుళం: ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని పోలీసులు మంగ‌ళ‌వారం అరెస్ట్ చేశారు. శ్రీ‌కాకుళం జిల్లా నిమ్మాడ‌లోని ఆయ‌న స్వ‌గృహంలో అచ్చెన్నాయుడిని పోలీసులు అదపులోకి తీసుకొని కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైసీపీ నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్టు అచ్చెన్నాయుడపై ఆరోపణలున్నాయి.

అసలు ఏం జరిగిందంటే… నిమ్మాడ నుంచి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భార్య సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమెపై పోటీకి వైసీపీ నుంచి అచ్చెన్నాయుడుకు వరసకు అన్న కొడుకైన కింజారపు అప్పన్న బరిలోకి దిగారు. అప్పన్నతో నామినేషన్ వేయించడానికి టెక్కలి వైసీపీ కోఆర్డినేటర్ దువ్వాడ శ్రీను వెళ్లారు. వీళ్లిద్దర్ని అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ అడ్డుకున్నారు. ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మార‌డంలో పోలీసులు ఎక్క‌డివారిని అక్క‌డే నిలువ‌రించారు. ముందస్తు జాగ్ర‌త్త‌గా బారీగా బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. త‌రువాత అభ్య‌ర్థిని ద‌గ్గ‌రుండి తీసుకెళ్లి నామినేష‌న్ వేయించారు. ఈ నేప‌థ్యంలో కోట‌బొమ్మాలి పోలీస్ స్టేష‌న్‌లో 22 మందిపై కేసు న‌మోదైంది. సోమ‌వారం 12 మందిని అరెస్టు చేయ‌గా మంగ‌ళ‌వారం అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

1 Comment
  1. […] ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు … […]

Leave A Reply

Your email address will not be published.