అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి కోటబొమ్మాళి సెషన్స్ కోర్టు ఈ నెల 15 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు అంపోలులోని జిల్లా జైలుకు తరలించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన స్వగృహంలో ఆయనను అదుపులోకి తీసుకొని కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన అనంతరం కోటబొమ్మాళి కోర్టుకు తరలించారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో టీడీపీ, వైఎస్సార్సీపీ అభ్యర్థుల మధ్య తోపులాట జరిగింది. ఈ కేసులో అచ్చెన్నాయుడిపై ఐపీసీ సెక్షన్ 147,148,324,307,384,506, 341,120(b),109,188, రెడ్ విత్ 149, ఐపీసీ 123(1), ఆర్పీఏ 1951 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. A1 నిందితునిగా కింజారపు హరిప్రసాద్, A2గా కింజారపు సురేష్, A3గా అచ్చెన్నాయుడు, A4గా కింజారపు లలితకుమారి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు.