దేశంలో కొత్తగా 8,635 కరోనా కేసులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 8,635 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బులిటెన్ లో పేర్కొంది. తాజాగా 94 మంది వైరస్ ప్రభావంతో మరణించారు. దేశంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 1,54,486కు పెరిగింది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,66,245కు పెరిగింది. తాజాగా 13,423 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా ఇప్పటి వరకు 1,04,48,406 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,63,353 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులిటెన్లో పేర్కొంది.