డబుల్ డెక్కర్ బస్సులకు టెండర్లు

హైదరాబాద్ : నగరంలో దాదాపు పదేళ్లకిందట నిలిచిపోయి డబుల్ డెక్కర్ బస్సులను పునరుద్ధరించడంపై టిఎస్ ఆర్టీసీ దృష్టి సారించింది. ఇంటర్ సిటీ సర్వీసుల కోసం 25 బస్సుల కొనుగోలుకు తెలంగాణ ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. రేపట్నుంచి ఈ నెల 11వ తేదీ వరకు టెండరు పత్రాలను కొనుగోలు చేయవచ్చని ఆర్టీసీ పేర్కొంది. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ఆసక్తి గల గుత్తేదారులతో ప్రీబిడ్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. టెండర్ల దాఖలుకు ఈ నెల 25 మధ్యాహ్నం 2 గంటల వరకు గడువు విధించారు. కాగా దాదాపు పదేళ్ల కిందట హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సులు పర్యాటకులను ఆకట్టుకునేవి. త్వరలోనే మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్లో రోడ్డెక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.