20 దేశాల విమానాలకు సౌదీ అనుమతి నిరాకరణ

రియాద్: సౌదీ అరేబియాలో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. సౌదీ అరేబియాలో ఇప్పటివరకు 368,639 కరోనా కేసులు నమోదయ్యాయి, అందులో 6,383 మంది రోగులు మరణించగా.. 360,110 మంది నయమై దవాఖానాల నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా సౌదీ అరేబియాలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా భారత్, పాక్ సహా 20 దేశాల నుంచి విమానాల రవాణాను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ జాబితాలో యూఏఈ, జర్మనీ, అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, ఈజిప్ట్, లెబనాన్, అర్జెంటీనా, ఇండోనేషియా, ఐర్లాండ్, ఇటలీ, బ్రెజిల్, పోర్చుగల్, టర్కీ, స్వీడన్, స్విట్జర్లాండ్, జపాన్ ఉన్నాయి. ఈ ఉత్తర్వులు బుధవారం నుంచే అమలులోకి వచ్చాయి. అయితే, భారత దౌత్యవేత్తలు, వైద్యులు లేదా వారి బంధువులకు మాత్రమే సౌదీ అరేబియాలో ప్రవేశించేందుకు అనుమతించారు.