ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం స్పంద‌న‌..

న్యూఢిల్లీ: ఎపి హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు త‌ర‌లింపుపై గురువారం రాజ్యసభలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు త‌ర‌లింపు నిర్ణ‌యం ప్ర‌స్తుతం ఎపి హైకోర్టు )స‌బ్ జ్యూడీస్‌) ప‌రిధిలో ఉంద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. అమ‌రావ‌తి నుంచి హైకోర్టు ను త‌ర‌లిస్తున్నారా? అని బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రశ్నించగా.. దానికి కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ లిఖితపూర్వకమైన సమాధానం ఇచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జగన్ ప్రతిపాదనలు పంపార‌ని తెలిపారు. ఉన్న‌త న్యాయ‌స్థానం త‌ర‌లింపు విష‌యం ఏపి హైకోర్టుతో.. ప్రభుత్వం సంప్రదింపులు, ఏకాభిప్రాయం తరువాతే తరలింపు నిర్ణయం ఉంటుందని మంత్రి తెలిపారు. త‌ర‌లింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌దే నిర్ణ‌య‌మ‌ని పేర్కొన్నారు. కాగా హైకోర్టు నిర్వహణ బాధ్యతంతా రాష్ట్రప్రభుత్వానిదే అని, పరిపాలన మాత్రం ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.