1 నుంచి శ్రీ‌వారి దర్శనాల సంఖ్య పెంపు?

తిరుమల : క‌లియుగ ప్ర‌త్య‌క్ష‌దైవం శ్రీ తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌.. తిరుమలను దర్శించుకునేందుకు సెప్టెంబ‌రు 1 నుంచి దర్శనాల సంఖ్యను పెంచే యోచనలో టిటిడి పాల‌క‌మండ‌లి ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ప్రస్తుతం 9 వేల మంది భక్తులను మాత్రమే దర్శనానికి టిటిడి అనుమతిస్తోంది. సెప్టెంబర్‌ 1 నుంచి 20 వేల నుంచి 30 వేల మందిని దర్శనానికి అనుమతించేలా ఏర్పాటు చేస్తోంది. జూలై 16 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా సెప్టెంబర్‌ 1 నుంచి సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనుంది. రేపు జరగబోయే టిటిడి పాలకమండలి సమావేశంలో దర్శనాల సంఖ్య పెంపుదలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు టిటిడి ప్రకటించింది. క‌రోనా విజృంభిస్తున్న వేల భ‌క్తుల సంఖ్య పెంచితే తీసుకోవాల్సిన జాగ్ర‌త‌ల గురించి పాల‌క‌మండ‌లి భేటీలో చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఏది ఏమైనా త్వ‌ర‌లో తిరుమ‌ల బాలాజీని పెద్ద సంఖ్యంలో భ‌క్తులు ద‌ర్శ‌నం చేసుకోనున్నా‌రు.   (వ‌చ్చేనెల‌ 19 నుంచి 27 వ‌ర‌కు శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు)

 

 

Leave A Reply

Your email address will not be published.