హిందుస్తానీ ముస్లింగా గ‌ర్విస్తున్నా..: గులాం న‌బీ ఆజాద్‌

కన్నీటి పర్యంతమైన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, విపక్ష నేత అయిన గలాంనబీ ఆజాద్‌ ఫిబ్రవరి 15వ తేదీతో ఆయన పదవీ కాలం ముగియనుంది. ఈ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో అజాద్‌,ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఉద్వేగానికి గుర‌య్యారు.
ఈ సంద‌ర్భంఒగా గులాం న‌బీ ఆజాద్ స‌భ‌లో మాట్లాడుతూ.. ఇప్ప‌టి వ‌ర‌కు పాక్ వెళ్ల‌ని అదృష్ట‌వ్య‌క్తిని తానే అని అన్నారు. పాక్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను మీడియాలో చ‌దువుతున్న‌ప్పుడు.. తాను ఇండియా ముస్లింనైనందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్న‌ట్లు ఆజాద్ అన్నారు. రాజ్య‌స‌భ నుంచి రిటైర్ అవుతున్న అజాద్ ఇవాళ స‌భ‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా పార్ల‌మెంట్‌లో త‌న‌కున్న అనుభ‌వాల‌ను నెమ‌రువేసుకున్నారు. తాను స‌భా వ్య‌వ‌హారాల‌ను మాజీ ప్ర‌ధాని అట‌ల్ నుంచి నేర్చుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అలాగే జీవితంలో తాను ఏడ్చిన సంద‌ర్భాల గురించి కూడా చెబుతూ ఆజాద్ కొన్ని క్ష‌ణాల పాటు భావోద్వేగానికి లోన‌య్యారు. క‌శ్మీర్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఉగ్ర‌దాడిలో హ‌త‌మైన బాధిత కుటుబాల‌ను క‌లిసిన‌ప్పుడు తను ఏడ్చేసిన‌ట్లు చెప్పారు.

ప్ర‌ధానితో అనుబంధం..
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో త‌న‌కు ప్ర‌త్యేక అనుబంధం ఉన్న‌ట్లు తెలిపారు. స‌భ‌లో ఉన్న‌ప్పుడు మాట‌ల వాగ్వాదం ఉంటుంద‌ని, కానీ ప్ర‌ధాని మోదీ ఎన్న‌డూ త‌న వ్యాఖ్య‌ల‌ను వ్య‌క్తిగ‌తంగా తీసుకోలేద‌న్నారు. ప‌ర్స‌న‌ల్ అంశాల‌ను, రాజ‌కీయాల‌ను దూరం చేసి చూస్తార‌ని మోడీని పొగిడారు.

కన్నీటి పర్యంతమైన ప్రధాని మోడీ
రాజ్యసభలో ప్రధాని మోడీ.. అజాద్‌ గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యారు. ఆజాద్‌ తనకు ఎప్పటి నుంచో తెలుసని అన్నారు. ‘ఉద్యోగాలు, పదవులు, అధికారాలు వస్తాయి.. పోతాయి.. కానీ వాటిని ఎలా నిర్వహించాలో గులాం నబీ ఆజాద్‌ను చూసి నేర్చుకోవాలి’ అని అన్నారు. అలాగే వారి మధ్య ఉన్న సంబంధమెలాంటిదో ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను గుజరాత్‌ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు.. జమ్మూకాశ్మీర్‌లో గుజరాతీ యాత్రికులపై ఉగ్రదాడి జరిగినప్పుడు.. ఆజాద్‌ రాత్రిపూట తనకు ఫోన్‌ చేసి ఆ దాడి గురించి చెబుతూ కన్నీటి పర్యంతమైనట్లు తెలిపారు. అలాగే.. రాజ్యసభలో ఆజాద్‌ స్థానాన్ని భర్తీ చేసే నేత ఎవరూ లేరని కొనియాడారు. ఆయన కేవలం పార్టీ కోసమే గాక.. సభ, దేశం కోసం ఆందోళ చెందే వ్యక్తి అని ప్రశంసించారు. ఆయనను ఎప్పటికీ రిటైర్‌ అవనివ్వబోనని, ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటానని ప్రధాని తెలిపారు.

1 Comment
  1. Ramu says

    🙏🙏🙏

Leave A Reply

Your email address will not be published.