నేటి అర్థ‌రాత్రి నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి

న్యూఢిల్లీ: సోమ‌వారం అర్థరాత్రి నుంచి ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రి కానుంది. దీంతో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలు టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లించే విధానానికి తెరపడింది. సోమ‌వారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఫాస్టాగ్‌ లేని వాహనాల నుంచి టోల్‌ప్లాజాల వద్ద రెట్టింపు ఫీజు వసూలు చేస్తామని కేంద్ర రోడ్డు, జాతీయ రహదారుల శాఖ ఆదివారం ప్రకటించింది. ఇకపైన ఫాస్టాగ్‌ అమలును వాయిదా వేసే ప్రసక్తే లేదని కేంద్ర రోడ్డురవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టంచేశారు. ఇప్పటి వరకు 2.54 కోట్ల మంది ఫాస్టాగ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకొన్నారని మంత్రి పేర్కొన్నారు. ఫాస్టాగ్‌ విధానాన్ని 2016వ సంవ‌త్స‌ర‌లోనే రెడీ అయిన కొన్ని ర‌కాల కారణాలతో దీని అమలు వాయిదా పడుతూ వచ్చింది. టోల్‌ప్లాజాల వద్ద రద్దీ, ఇంధన ఖర్చును తగ్గించే లక్ష్యంలో డిజిటల్‌ రూపంలో ఫీజులు చెల్లించే ఫాస్టాగ్‌ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విష‌యం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.