వ‌చ్చే నెల 28 నుంచి డిఎడ్‌ ఫస్టియర్ ప‌రీక్ష‌లు

అమరావతి: ప‌రీక్ష నిర్వ‌హ‌ణ వ్య‌హారంపై దేశ‌వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. శుక్ర‌వారం (నేడు) ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిందే అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అంత‌కు ముందు రోజు జెఇఇ, నీట్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని 150 మంది విద్యావంతులు ప్ర‌ధాని మోడీకి లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో డిఎడ్ 2018-19 విద్యార్థులకు మొదటి ఏడాది పరీక్షలు సెప్టెంబరు 28 నుంచి ప్రారంభం కానున్నాయని సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరు ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. సెప్టెంబరు 28న పేపరు-1, 29న పేపరు-2, 30న పేపరు-3 అక్టోబరు 1న పేపరు-4, 3వ తేదీన పేపరు-5, 5వ తేదీన పేపరు-6 నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని పరీక్షలూ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. (వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల)

Leave A Reply

Your email address will not be published.