ఫైనల్ ఇయర్ పరీక్షలు తప్పనిసరి..: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : యూనివర్సిటీలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించవలసిన అవసరం ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని వాయిదా వేయవచ్చునని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం ఈ పరీక్షలను వాయిదా వేయవచ్చునని వివరించింది. ఫైనల్ ఇయర్ విద్యార్థినీ, విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండా, తదుపరి తరగతులకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోట్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. యుజిసి ఆదేశాల మేరకు ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయరాదని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు యుజిసితో సంప్రదించి, పరీక్షల నిర్వహణకు తేదీలను ఖరారు చేయవచ్చునని తెలిపింది. యుజిసి ప్రకటించిన సెప్టెంబరు 30 గడువును రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించవలసిన అవసరం లేదని తెలిపింది. కరోనా దృష్ట్యా పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే.. యుజిసితో సంప్రదించి కొత్తగా తేదీలను ఖరారు చేసుకోవచ్చునని తెలిపింది.
ఫైనల్ ఇయర్ విద్యార్థినీ, విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండా, తదుపరి తరగతులకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోట్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఆదేశాల మేరకు ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయరాదని వివరించింది.
ఫైనలియర్ ఎగ్జామినేషన్స్ తప్పనిసరిగా నిర్వహించాలని యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలు సరైనవేనని తెలిపింది. పరీక్షలు నిర్వహించకుండా ప్రమోషన్ చేయరాదన్నది కూడా సరైనదేనని పేర్కొంది. కోవిడ్ దృష్ట్యా పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే, యూజీసీతో సంప్రదించి, కొత్తగా తేదీలను ఖరారు చేసుకోవచ్చునని తెలిపింది. (ఫైనల్ ఇయర్ పరీక్షలు తప్పనిసరి..: సుప్రీంకోర్టు)
Supreme Court says students cannot be promoted without University final year exams. https://t.co/Ko55nKaczS
— ANI (@ANI) August 28, 2020
[…] ఫైనల్ ఇయర్ పరీక్షలు తప్పనిసరి..: సుప… […]