ఏపీలో 10,603 కొత్త కేసులు, 88 మరణాలు

అమరావతి : ఎపిలో కరోనా విజృభిస్తోంది. గత ఐదు రోజులుగా పది వేలకు పైగా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,603 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 88 మంది కరోనా బాధితులు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,884కు చేరుకుంది. ఎపిలో ఇప్పటి వరకు 4,24,767 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 99,129 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 3,21,754 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 9,067 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇవాళ ఒక్కరోజే 63,077 మందికి కరోనా పరీక్షలు నిర్వహించడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 36,66,422కు చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది.

Leave A Reply

Your email address will not be published.