తాజ్‌మ‌హ‌ల్ ప్ర‌వేశ టికెట్ ధ‌ర‌ పెంపు

ఆగ్రా: ప‌ర్యాట‌కుల‌ను అమితంగా ఆక‌ర్శించే ఆగ్రాలోని తాజ్‌మ‌హ‌ల్ ప్ర‌వేశ టెక్కెట్ ధ‌ర‌ పెంచారు. ప్ర‌స్తుతం భార‌త ప‌ర్యాట‌కులు రూ.50, విదేశీ ప‌ర్యాట‌కులు రూ. 1100 ప్ర‌వేశ టికెట్ ధ‌ర చెల్లించి తాజ్‌మ‌హ‌ల్‌ను సంద‌ర్శిస్తున్నారు. అయితే ప్ర‌స్తుత‌మున్న రేట్ల‌ను రూ. 50 నుంచి రూ. 80కి, రూ. 1100 నుంచి రూ. 1200ల‌కు ధ‌ర‌ల‌ను పెంచ‌డం జ‌రిగింది. మెయిన్ డోమ్‌ను చూడాల‌నుకునే వారి నుంచి పై ఛార్జీలు కాకుండా, ఆర్కియోలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా అద‌నంగా రూ. 200 వ‌సూలు చేస్తుంది. దీనికి అద‌నంగా ఆగ్రా డెవ‌ల‌ప్‌మెంట్ ఆథారిటీ కూడా మ‌రో రూ. 200ల‌ను వ‌సూలు చేయ‌నుంది. మొత్తంగా తాజ్‌మ‌హ‌ల్‌ను సంద‌ర్శించాల‌నుకునే భారతీయ‌ ప‌ర్యాట‌కులు రూ. 480, విదేశీ ప‌ర్యాట‌కులు రూ. 1600 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెంపుద‌ల‌పై ప‌లురువురు ప‌ర్యాట‌కు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

తాజ్‌కి ఎంట్రీ టికెట్లు పెంచే కొత్త ప్రతిపాదనపై స్పందిస్తూ పర్యాటకుడు సౌరభ్ మిశ్రా ఒక మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ, “ధ‌రలు పెరిగితే, భారతీయ పర్యాటకులు తమ సొంత వారసత్వాన్ని చూడటం అసౌకర్యానికి గురిచేస్తుంది. ప్రధాన గోపురం సందర్శించడానికి మేము రూ .50 చెల్లించాము. ఇది మళ్ళీ పెరుగుతుంది, భారతీయ పర్యాటకులు ఈ టికెట్ ధ‌ర‌ల పెరుగుద‌లతో చాలా మంది సంద‌ర్శ‌కులు వెన‌క‌డుగు వేస్తారు.“ అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.