ఎంద‌రికో ఆద‌ర్శం..`మై విలేజ్‌ షో`

హల్ చల్ చేస్తున్న యూట్యూబ్ చాన‌ళ్లు

ఇటీవల యూట్యూబ్ చానళ్ళు హల్ చల్ చేస్తున్నాయి. కానీ ఒకటి రెండు మినహా రాసిలోనూ వాసిలోనూ నాణ్యత ఉండటం లేదు. ప్రత్యేకంగా పాత కరీంనగర జిల్లాలో లఘు చిత్రాలు విపరీతంగా వస్తున్నాయి.. జగిత్యాల జిల్లా లంబాడి పల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు శ్రీకాంత్ ఎం టెక్ చేసి, ఒక కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫసర్ ఉద్యోగం వదులుకుని ఎంతో ధైర్యంతో “మై విలేజ్ షో“ పేరుతొ సీరియల్స్ ప్రారంభించారు. అవి ఎందరినో ఆకట్టుకున్నాయి.. తెలంగాణ పల్లెకు అద్దం పట్టాయి.. నాటి ద్వారా గంగవ్వ, అనీల్ జీల ,రాజు, అంజుమమ్మ, శివ, వంటి వారి నటనకు జనం కూడా బ్రహ్మరథం పడుతున్నారు.. అదే విధంగా సదన్న కామెడీ కూడా విశేష ప్రజాదరణ పోందింది. ఇక కరీంనగర్ నుంచి లఘు చిత్రాలు వస్తున్నా.. అంతగా నాణ్యత ఉండటం లేదు, అందుకు కారణం కథలో పట్టు లేక పోవడం, నటన కూడా సరిగా రాణి వారికీ అవకాశాలు ఇవ్వడం, అయితే స్త్రీ పాత్ర దారులు చాలా బాగా నటిస్తున్నారు.. సీత మహా లక్ష్మి , రాధికా, హరిత, ప్రియా వంటి వారి నటన అందరి ఆమోదం పొందింది.. వారు పాత్రల్లో వొదిగి తమ పరిధిలో నటిస్తారు.. ఇంత పెద్ద పని చేసేప్పుడు సామాజిక కోణం, విజ్ఞానాత్మకంగా ఉండాలన్న ఆలోచన కూడా వీరికి రాదు.. ఒక దర్శకుడు కేవలం.. హడావిడి, దర్శకుడినన్న అహంభావం టపా ఇంకేమికనిపించదు. ఒక కామెడీ నటుడు ఏం మాట్లాడినా ఒకే రేంజ్ లో ఉంటుంది. అంటే అంత పిచ్చిగా చేస్తున్నా చూస్తున్నారన్నది కామెడీ కావచ్చు. బాట సారి సీరియల్ బాగుంది.. కానీ అదెలా ప్రాజెక్ట్ చేయాలో పాపం తెలియదు.. మరికొన్ని పుస్తకాలు చదవాలని, మరికొన్ని చిత్రాలు చూడాలని, ఎక్కడైనా శిక్షణ పొందాలన్న ఆలోచన కూడా రాదు.. ఎందుకంటె తాము గొప్ప వారిమన్న భ్రమల్లో వున్నారు.. ఇప్పటికైనా కళాకారులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, రచయితలు శిక్షణ పొంది నాణ్యత పెంచుకుంటే బాగుంటుంది.. లేకుంటే ఎన్నెన్నో విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది.. ఈ సందర్బంగా లంబాడిపల్లి శ్రీకాంత్ గారిని, సదాన్నను, ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.. మీరు మరిన్ని మంచి ప్రయోగాలు చేయాలని కోరుకుంటున్నాం.

 

సామాజిక మాధ్యమాల్లో స్వీయ నియంత్రణ తప్పని సరి.. సినిమా లో సెన్సార్ బోర్డు ఉంటుంది.. కానీ యూట్యూబ్ లఘు చిత్రాలకు ఆ అవకాశం ఉండదు.. మారాలు, నటన, ప్రవర్తన విషయాలలో జాగ్రత్తలు పాటించాలి.. ఒక క్రమ పద్ధతిలో యూట్యూబ్ చిత్రాలు నిర్మిస్తే అద్భుతమైన స్పందన లభిస్తుంది.. అమెరికా లో వుండే వాసు అనే ఉద్యోగి గత కొన్నేళ్లుగా వాసు vlogs పేరిట యూట్యూబ్ చిత్రాలు పెడుతుంటారు. అమెరికాలో జీవన సరళి.. అక్కడి అవసరాలు, మొదలైనవి అందులో మనం చూడొచ్చు.. వాసు వాళ్ళ ఇద్దరు పాపలు అందులో పాత్రలు అంటే ఈ మధ్య చిన్న పాప హనీ పుట్టిన రోజు జరిగితే ప్రపంచమంతా అభినందనలు తెలిపారు ఆ వీడియో సుమారు నాలుగు గంటలు వచ్చింది. అన్ని కట్ చేసి చూపిస్తేనే అంతగా వచ్చింది.. అదే విధంగా వరంగల్ వందన అనే కార్యక్రమం లో వందన పాత్రధారి నటన చాలా బాగుంటుంది.. ఇలాంటివి స్ఫూర్తిగా తీసుకోవాలి.. అంతే కానీ నాకు అన్ని తెలుసు నాకెవరు చెప్పేది అనే ఆలోచన నుంచి బయట పడాలి.

టి . వేదాంత సూరి

Leave A Reply

Your email address will not be published.