ప్రణబ్ చిత్రపటానికి రాష్ట్రపతి, ప్రధాని, ప్రముఖుల నివాళులు
న్యూఢిల్లీ : అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీ 10 రాజాజీ మార్గ్‌లోని ప్రణబ్ నివాసంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు. అంతకుముందు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి హర్షవర్ధన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా, బిజేపి నేత జ్యోతిరాధిత్య సింధియా, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ సహా పలు పార్టీలకు చెందిన నాయకులు, ఇతర ప్రముఖులు ప్రణబ్ చిత్ర పటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. టీమిండియా క్రికెటర్లు, ప్రముఖులు నివాళులు అర్పించారు. సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలియజేశారు.
* ‘దేశం గొప్ప లీడర్‌ను కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’ – విరాట్ కోహ్లీ
* ‘దేశానికే ఆదర్శవంతమైన నేత. ఆయన ఆత్మీయులకు నా సానుభూతి తెలియజేస్తున్నా’ – రోహిత్ శర్మ
* ‘మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరని తెలిసి చాలా బాధేసింది. పలు దశాబ్దాల పాటు ఆయన దేశానికి ఉత్తమ సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ – సచిన్ టెండూల్కర్
* ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల బాధాతప్త హృదయంతో నివాళులర్పిస్తున్నా. ఓం శాంతి’ – వీరేంద్ర సెహ్వాగ్
* ప్రణబ్ ముఖర్జీ మరణ వార్త విని తీవ్ర మనోవేదనకు గురయ్యా. గౌరవీనయులైన నాయకుల్లో ఆయన ఒకరు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు శక్తినివ్వాలి. ఆయన సేవలను ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది’ – గౌతమ్ గంభీర్
కాగా మధ్యాహ్నం 2 గంటలకు లోధి శ్వశాన వాటికలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా సురక్షిత దూరం, ఇతర నిబంధనలు పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మొదట నివాళులర్పించనున్నారు. పలువురు ప్రముఖులు ప్రణబ్ పార్ధివదేహానికి నివాళులర్పించనున్నారు.
[…] ప్రణబ్ చిత్రపటానికి రాష్ట్రపతి, ప్… […]