జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
అమరావతి: ఎపిలో పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. తదుపరి ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఫలితాలను ప్రకటించవద్దని ఎస్ఇసిని హైకోర్టు ఆదేశించింది.
పరిషత్ ఎన్నికల స్టే పై ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరం వాదనలు వినిపించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని ఏజీ కోర్టును కోరారు. ఎస్‌ఈసీ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ సీవీ మోహన్ రెడ్డి.. పిటిషన్ వేసిన వర్ల రామయ్యకు ఎన్నికలతో సబంధం లేదని తెలిపారు. 28 రోజుల కోడ్ నిబంధన ఎన్నికలకు వర్తింపజేయనవసరం లేదని సీవీ మోహన్ రెడ్డి హై కోర్టు డివిజన్ బెంచ్‌కు తెలిపారు. ఇరు పక్షాల వాదలను విన్న బెంచ్ పరిషత్ ఎన్నికలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపటి ఎన్నికల పోలింగ్‌కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామాగ్రితో గ్రామాలకు తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.