బావిలోప‌డ్డ ఏనుగుపిల్లను ర‌క్షించిన అధికారులు.. వీడియో వైర‌ల్‌

భువ‌నేశ్వ‌ర్: అడ‌వి నుంచి త‌ప్పిపోయి జ‌నావాసాల్లోకి వ‌చ్చిన ఓ ఏనుగుపిల్ల 15 అడుగుల లోతున్న పాడుబ‌డ్డ బావిలో ప‌డిన ఘ‌ట‌న ఒడిశా రాష్ట్రం మ‌యూర్‌భంజ్ జిల్లాలోని ఓ గ్రామంలో శ‌నివారం చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా స‌మాచారం అందుకున్న‌ అట‌వీశాఖ అధికారులు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకుని గున్న ఏనుగును ర‌క్షించారు. బావికి ప‌క్కన క్రేన్ సాయంతో గొయ్యి తవ్వి గున్న ఏనుగు ముందు కాళ్ల‌కు తాళ్ల‌ను క‌ట్టి క్రేన్ ద్వారా బ‌య‌టికి లాగారు. రె్స్క్యూ టీం గున్న ఏనుగును బ‌య‌ట‌కు తీసిన దృశ్యాలు ఇంట‌ర్‌నెట్‌లో వైర‌ల్ అయ్యారు. మీరూ ఓ లుక్కేయండి.

Leave A Reply

Your email address will not be published.