తెలంగాణలో కొత్త‌గా 2251 క‌రోనా కేసులు.. 6 మ‌ర‌ణాలు

హైద‌రాబాద్‌: తెలంగాణలో క‌ర‌నా రెండో ద‌శ ఉధృతి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 79,027 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 2251 కొవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ సోమవారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,29,529కు చేరింది. తాజాగా మరో ఆరుగురు కరోనాతో మృతిచెందారు. ఇప్పటి వరకు కరోనాతో మొత్తం 1765 మంది ప్రాణాలు వదిలారు. తాజాగా 565 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. దాంతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో రికవరీ కేసులు 3,05,900కు పెరిగాయి. ప్ర‌స్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 21,864గా ఉండగా.. అందులో హోం ఐసోలేషన్‌లోనే 14,431 మంది ఉన్నట్టు అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.