`ప‌టేల‌మ్మ ఎవుసాన్ని`, తెలంగాణ ప‌ల్లె వాతావ‌ర‌ణాన్ని చూడాల్సిందే…!

  • స‌మీక్ష‌:“పటేలమ్మ కొత్తగా ఎవుసం జేత్తే“
  • చిత్రం: “పటేలమ్మ కొత్తగా ఎవుసం జేత్తే“
  • న‌టీన‌టులు: సీతామాల‌‌క్ష్మి, స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, ర‌జాక్‌, సాయి పూసాల‌, మ‌హ‌.
  • కెమెరా: ‌ఏముల మ‌హేష్‌
  • క‌థ‌-మాట‌లు: సిద్దు క‌న‌కం
  • అసిస్టెంట్ ఎడిటర్స్‌: మ‌హేష్ పాలోజి
  • ఎడిటింగ్- ద‌ర్శ‌క‌త్వం: రాము మొగిలోజి
  • నిర్మాత‌: స‌మీక్ష‌
  • విడుద‌ల తేదీ:

ఇటీవల కరీంనగర్ నుంచి వీడియో లఘు చిత్రాలు చాలా వస్తున్నాయి అని ఇటీవల మనం చెప్పు కున్నాం. ఈ నేపధ్యం లో రామ్ మొగిలోజి ఎడిటింగ్ , డైరెక్షన్ చేసిన పటేలమ్మ కొత్తగా ఎవుసం జేతే అనే షార్ట్ ఫిలిం.. చాలా నీట్ గా వుంది. కొన్ని సూచనలు చేయాలనిపించింది. ఆలా చేస్తే ఇంకా బాగుండేది.. నటుల సంభాషణల విషయం లో జాగ్రత్త పడాలి.

బ‌లం:
+సీతామాల‌‌క్ష్మి న‌ట‌న‌
+డైరెక్ష‌న్‌
బ‌ల‌హీన‌త‌లు
-క‌థ‌
-మాట‌లు
-సందేశం లేక‌పోవ‌డం

ఫిలిం స్టార్టింగ్ లో 1. పటేలమ్మ పేపర్ చదువుకుంట కాకుండా ఏదైనా వ్యవసాయ పనులు చేస్తున్నట్టు ఉంటే బాగుండేది. 2. పాలేర్ల ముందు భర్తను అనడం మంచి పధ్ధతి కాదు. 3. పటేలు సిటీ లో ఉండేవాడు.. డ్రెస్, మాటలు సరిపోయేలా లేవు. 4. చివరి సీన్ బాగు లేదు. 5పటేలమ్మ పడిపోతే అంతసేపు ఆలోచించొద్దు. వెంటనే లేపాలి.. 6,అందులోని రెండర్థాల మాటలు బాగు లేదు. 7ఈ చివరి సీన్ బదులు పటేలమ్మ వ్యవసాయం లో మంచి దిగుబడి వచ్చినట్టు, 8. డబ్బు పాలేర్లకు బహుమతిగా ఇచ్చినట్టు ఉంటే బాగుండేది. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయకుంటే మంచిది. సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చేలా ఉండాలి. చూసే ప్రేక్షకులలో ఒకరిధ్దరిలో మార్పు వచ్చినా తమ ప్రయత్నం విజయవంత మైందిగానే భావించాలి. చివరిగా రామ్ మోరీలోజి గారికి అభినందనలు .

చివ‌ర‌గా: `ప‌టేల‌మ్మ ఎవుసాన్ని`, తెలంగాణ ప‌ల్లె వాతావ‌ర‌ణానాన్ని చూడాల్సిందే…!

–టి . వేదాంత సూరి

గ‌మ‌నిక: ఈ స‌మీక్ష స‌మీక్ష‌కుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది స‌మీక్ష‌కుడి వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్రమే.

 

 

Leave A Reply

Your email address will not be published.