మ‌ద్యం ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు

చీప్‌ బ్రాండ్స్‌ ధర తగ్గింపు

అమరావతి : మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీపి కబురును అందించింది. మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐఎంఎఫ్‌ లిక్కర్‌, ఫారెన్‌ లిక్కర్‌, బీర్‌, వైన్‌ ధరలను క్రమబద్దీకరిస్తూ మార్పులు చేసింది. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ భేటీ అనంతరం ధరలను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.నూతనంగా జారీచేసిన ఆదేశాల ప్రకారం రూ.120 వరకూ ధర ఉన్న బ్రాండ్లలో 90 ఎంఎల్‌కు రూ.10, 180 ఎంఎల్‌కు రూ.30, 360 ఎంఎల్‌కు రూ.60, 750 ఎంఎల్‌కు రూ.120 వరకూ తగ్గించారు. 1000 ఎంఎల్‌ ధరల్లో ఎటువంటి మార్పులూ చేయలేదు. రూ.120 నుండి రూ.150 వరకూ ధర ఉన్న బ్రాండ్లలో రూ.30 నుంచి రూ.280 వరకూ తగ్గించారు. రూ.150 నుంచి రూ.190 వరకూ ధర ఉన్న బ్రాండ్ల ధరల్లో ఎటువంటి మార్పులూ చేయలేదు. రూ.190 నుంచి రూ.210 వరకూ ఉన్న బ్రాండ్లను క్వాంటిటీని బట్టి రూ.40 నుంచి రూ.300 వరకూ పెంచారు. రూ.210 నుంచి రూ.290 వరకూ ధర ఉన్న బ్రాండ్లకు రూ.40 నుంచి రూ.340 వరకూ, రూ.290 నుంచి రూ.360 వరకూ ధర ఉన్న బ్రాండ్లకు రూ.60 నుంచి రూ.470 వరకూ ధరను పెంచారు. అలాగే బీరు 330 ఎంఎల్‌కు రూ.30, 650 ఎంఎల్‌కు రూ.30 చొప్పున ధర తగ్గించారు. అప్పటికప్పుడు తాగే డ్రింక్స్‌కు సంబంధించి అన్ని రకాల్లోనూ రూ.30 తగ్గింపు ఇచ్చారు. రాష్ట్రంలో అమ్ముడవుతున్న లోకల్‌ బ్రాండ్లకు సంబంధించి రూ.150 నుంచి రూ.190 ధర ఉన్న మద్యం బాటిళ్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయనే ఉద్దేశంతో వాటిల్లో ఎటువంటి మార్పులూ చేయలేదని తెలిసింది.

 

 

Leave A Reply

Your email address will not be published.